నాకేమీ కాలేదు …

560

గత కొంత కాలంగా హీరో రానా అనారోగ్యం పాలయ్యారని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది . రానా కు కంటి సమస్య ఉందని , త్వరలో శస్త్రచికిత్స జరుగుతుందన్న వార్తలకు తోడు , ఓ టీవీ ఇంటర్వ్యూలో రానా తండ్రి దగ్గుబాటి సురేష్ బాబు మాట్లాడుతూ , తన కుమారుడు అనారోగ్యంతో ఉన్నాడని , త్వరలోనే చికిత్స ప్రారంభమవుతుందని చెప్పడంతో ఆయన అభిమానుల్లో ఆందోళన పెరిగింది . అయితే ఈ విషయం పై రానా తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించారు . “నా ఆరోగ్యం గురించి చాలా కొత్త వార్తలను వింటున్నాను , నేను బాగానే ఉన్నా . కాస్తంత రక్తపోటు సమస్య ఉంది . అతి త్వరలోనే అంతా బాగవుతుంది . నా పై ప్రేమ చూపుతున్న వారికి కృతజ్ఞతలు . ఇది నా ఆరోగ్యం … మీది కాదు లేని పోనీ పుకార్లు సృష్టించవద్దు ” అని ట్వీట్ చేశారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here