వైసీపీ ఎమ్మెల్యేకు ఘలక్ …

4805

2014 ఎన్నికలలో కడప జిల్లా రాయచోటి నుండి వైసీపీ అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డి గెలిచిన విషయం తెలిసినదే . ఇప్పుడు ఆయనకు ఒక షాక్ తగిలింది . 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాయచోటి నియోజకవర్గ స్థానం నుంచి తాను పోటీలో ఉంటానని రాయచోటి వైసీపీ నియోజకవర్గ నేత మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు . శనివారం మండలంలోని రాచపల్లెకు చెందిన మేరా నాగన్న అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న రాంప్రసాద్‌రెడ్డి ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు . అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ టీడీపీ నాయకులు చేస్తున్న ఉక్కు దీక్ష దండగని , వైఎస్‌ జగన్‌ సీఎం అయితేనే కడప జిల్లాకు ఉక్కు పరిశ్రమ వస్తుందన్నారు . నియోజకవర్గంలో ప్రజలు మూడవ వ్యక్తి కోసం అన్వేషిస్తున్నారని , తాను 2019 ఎన్నికల్లో తప్పకుండా పోటీలో ఉంటానని , ఏ నాయకుడికి సపోర్టు చేయనని తెలిపారు . అనంతరం మండల కేంద్రంలోని అయోధ్యాపురం రాజశేఖర్‌రెడ్డి , చిట్లూరు పంచాయతీ పాలన్నగారిపల్లెకు చెందిన వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ధర్మారెడ్డి ఇళ్లకు తేనేటి విందుకు హాజరయ్యారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here