చెర్రీ కోసం రకుల్ …

619

రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రాంచరణ్ తన తదుపరి చిత్రం బోయపాటి శీను దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసినదే . బోయపాటి మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న ఈ సినిమాలో చెర్రీ చాలా స్టైలిష్ గా కనిపించనున్నారు . ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శర వేగంగా జరుగుతోంది . అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించి ఒక వార్త ఫిలిం నగర్ వర్గాలలో చక్కర్లు కొడుతోంది .

బోయపాటి సినిమాలలో స్టార్ హీరోయిన్ల స్పెషల్ సాంగ్స్ ఉండడం ఆనవాయితీ . అదే ఆనవాయితిని కంటిన్యూ చేస్తూ చరణ్ సినిమాలో కూడా ఒక స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశారు . అయితే ఈ స్పెషల్ సాంగ్ లో చరణ్ సరసా రకుల్ నటించనున్నారట . రాంచరణ్ తో ఇప్పటికే బ్రూస్ లీ , ధ్రువ సినిమాలలో రకుల్ కలిసి నటించారు . మరి ఈ సాంగ్ లో కూడా రకుల్ చరణ్ తో జతకట్టి ఏ మేరకు ప్రేక్షకులను ఉత్సాహపరుస్తారో చూడాలి .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here