మగధీర సినిమా పనులు మొదలు ఏంటి అనుకుంటున్నారా , లేదా ఈ సినిమాకు సంబంధించి రాజమౌళి సీక్వెల్ ఏమైనా ప్లాం చేస్తున్నారా అన్న సందేహం వస్తోందా ? అయితే మీరు పొరపాటు పడ్డట్టే . ఇక అసలు విషయానికొద్దాం . రామ్ చరణ్ హీరోగా 2009 లో మగధీర విడుదలై కాసుల వర్షం కురిపించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది . ఇప్పుడు ఆ సినిమాను జపనీస్ లోకి అనువదిస్తున్నారు . ఆ అనువాద పనులలో జక్కన్న నిమగ్నమై ఉన్నారట . ఇటీవలే తన చిత్రమైన బాహుబలిని జపనీస్ లోకి అనువదించి విడుదల చేసి జపాన్ ప్రేక్షకుల మన్ననలను పొందాడు . ఈసారి మగధీర సినిమాతో మరో సారి జపాన్ ప్రేక్షకులను పలకరించేందుకు రాజమౌళి సిద్ధమవుతున్నారట . మగధీర సినిమా అయిన తరువాత ఈగ సినిమాను కూడా అదే తరహాలో జపాన్ లో విడుదల చేయాలని చూస్తున్నారట .
ఇప్పటికే జక్కన్న రాంచరణ్ ,ఎన్ఠీఆర్ తో మల్టీస్టారర్ చిత్రం స్క్రిప్ రెడీ చేసే పనిలో ఉన్నారని అందరూ భావించినా చెర్రీ ,ఎన్ఠీఆర్ వారి వారి సినిమాలలో బిజీ గా ఉండడం వలన రాజమౌళి ఈలోగా మగధీర సినిమాను జపనీస్ లోకి అనువదిస్తే బాగుంటుందని భావించి ఆ పనిలో పడ్డారు .