దర్శకుడు మారుతి కథతో జె . ప్రభాకర రెడ్డి దర్శకత్వంలో సుధీర్ బాబు , నందిత జంటగా తెరకెక్కి విజయం సాధించిన సినిమా “ప్రేమ కథా చిత్రం ” .  కామెడీ హారర్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో సుమంత్ అశ్విన్ హీరోగా సీక్వెల్ ను ప్రారంభించనున్నారు . త్వరలోనే “ప్రేమ కథా చిత్రం 2” చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది . ఈ చిత్రం తో హరి కిషన్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు . ఈ సినిమాలో సుమంత్ కు జోడీగా ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు . ఒకరు జాంబ లకిడి పంబ ఫేమ్ సిద్ధి  ఇడ్నాని  ,మరొకరు ఎక్కడి పోతావు చిన్నవాడా ఫేమ్ నందిత శ్వేత . ప్రేమ కథా చిత్రం సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన సుదర్శన్ రెడ్డి ఈ సీక్వెల్ కు కూడా నిర్మిస్తున్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments