యుగపురుషుడు నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా బాలకృష్ణ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా యన్ .టీ .ఆర్ . ఇప్పుడు ఈ చిత్రం పై ఒక ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ వర్గాలలో చక్కర్లు కొడుతుంది . ఎన్ఠీఆర్ జీవిత చరిత్రను మూడు గంటల సినిమాలో చూపించడం చాలా కష్టమని క్రిష్ భావిస్తున్నారని , అందుకని ఈ చిత్రాన్ని రెండు భాగాలు గా తీసి మొదటి భాగంలో ఎన్ఠీఆర్ సినీ జీవితాన్ని , రెండొవ భాగంలో రాజకీయ జీవితం గురుంచి చూపిస్తే బాగుంటుందని అనుకుంటున్నారని , ఈ విషయమై ఆయన ఇప్పటికే బాలకృష్ణకు తన మనసులోని మాట చెప్పారని సమాచారం . ఇటీవల విడుదలైన సావిత్రి బయోపిక్ లో కూడా కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించిన మూడు గంటల నిడివిలో చూపలేక వాటిని కత్తిరించి తరువాత యూట్యూబ్ లో విడుదల చేశారు . మరి ఈ సినిమా విషయమై బాలకృష్ణ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments