బిగ్ బాస్ సీజన్ 2 షో మొదలై రెండు వారాలు పూర్తి అయ్యింది . ఈ రెండు వారాలలో హౌస్ లో ఉన్న 16 మంది కంటెస్టెంట్స్ పై వివిధ అభిప్రాయాలు వెలువడుతున్నాయి . అయితే కౌషల్ విషయమై ఆయన ఆడవాళ్ళ పట్ల విధానం పై అనేక అభిప్రాయాలు వెలువడుతున్నాయి . హౌస్ లో కూడా ఈ విషయం పై తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది . అయితే ఇప్పుడు ఈ విషయం పై ప్రముఖ సినిమా క్రిటిక్ కత్తి మహేష్ స్పందించారు . ఒక యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూ లో ఆయన మాట్లాడుతూ కౌషల్ యాడ్ ఫిలిమ్స్ , బాడీ బిల్డింగ్ విభాగాలలో ఉన్నవారిని , అటువంటి కెరీర్లలో ఆడ , మగ అనే బేధం లేకుండా కౌగిలించుకోవడం సహజన్నారు . హౌస్ లో ఒక అమ్మాయి కౌషల్ తనపై చేతులు వేసి మాట్లాడుతున్నారని , తనతో ఆయన మిస్ బిహేవ్ చేస్తున్నారనడంలో పూర్తిగా నిజం లేదని , కౌషల్ మామూలుగానే అతను బయట తిరిగే వాతావరణం దృష్ఠ్యా ఆయన సహజం గానే చేతులు వేసి ఉండొచ్చని కత్తి మహేష్ అభిప్రాయపడ్డారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments