ఆ టీడీపీ ఎమ్మెల్యే కు జగన్ గట్టి షాక్ ఇస్తున్నారే …

4214

పశ్చిమ గోదావరి జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలలో ఎక్కువగా వినిపించే పేరు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ . ఈయన ఎప్పుడూ అనేక వివాదాల మధ్య ఉంటూ అనే కేసులతో ఉన్నారు . ఆయన వ్యవహార శైలి గురుంచి పెద్దగా చెప్పుకోవలసిన అవసరం లేదు , ఆయన ఎప్పుడు దూకుడుగా వివాదాస్పదంగా నడుచునే వ్యక్తి అని చాలా సందర్భాలలో ఆయన వ్యవహరించిన ప్రవర్తననుబట్టి అర్ధమవుతోంది . అయితే ఇప్పుడు ఎదురులేని టీడీపీ ఎమ్మెల్యేకు రానున్న ఎన్నికలలో గడ్డు కాలం తప్పదంటున్నారు జిల్లాలోని కొందరు ముఖ్య నాయకులు .

ఆయన ప్రజలను దూషించడం , ఇసుక మాఫియా , భూ కబ్జా కేసులలో ముఖ్యంగా ఆయన పేరు వినిపించడం వల్లనా రాను రాను ఆయనకు చెడ్డపేరు వస్తున్నది , ఆఖరికి సొంత పార్టీ వారే చింతమనేని విమర్శించే పరిస్థితి . దెందులూరు నియోజకవర్గం లో 1994 మొదలుకొని విజయం సాధిస్తూ వచ్చింది . ఒక్క 2004 లో మాత్రమే ఇక్కడ కాంగ్రెస్ నుంచి మాగంటి బాబు విజయం సాధించారు . ఇప్పుడు వైసీపీ అభ్యర్థిగా యువకుడు , వైసీపీ యూకే ,యూరప్ కన్వీనర్ గా ఉన్న ఎన్నారై కొఠారి అబ్బయ్య చౌదరిని జగన్ ఖరారు చేశారు . ఆయనకు ఇప్పుడు దెందులూరు నియోజికకవర్గం యూత్ లో రోజు రోజు కి ఆదరణ పెరిగిపోతుండడంతో ఈసారి చింతమనేని అసలు గెలుస్తారా అనే అనుమానం రాజకీయ వర్గాలలో కలవరం మొదలైంది .

2014 సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కారుమూరి నాగేశ్వరరావు గట్టి పోటీనే ఇచ్చినా చివరికి చింతమనేని 20 వేల ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు . అయితే రానున్న ఎన్నికలలో చింతమనేని కి మాత్రం గడ్డు కాలం తప్పేలా లేదు . ముఖ్యంగా ఈ పరిణామానికి చింతమనేని ప్రవర్తనే కారణమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు . సొంత నియోజకవర్గ ప్రజలను కొడుతూ , నోటికి వచ్చినట్టు దుర్భాష లాడుతూ ఉన్న నేపథ్యంలో ఆయనకు బాగా బుద్ధి చెప్పాలని ప్రజలు అనుకుంటున్నారు . దీనికి తోడు వైసీపీ అధినేత జగన్ కూడా దెందులూరు నియోజకవర్గం పై ప్రత్యేక శ్రద్ధ చూపించడం , ప్రజాసంకల్ప యాత్రలో ఆ నియోజకవర్గంలో చింతమనేని తీరును అంతా వివరిస్తూ ఎండగట్టారు . ఈ పరిణామాలు అన్నీ చూస్తూ ఉంటె కచ్చితంగా రానున్న ఎన్నికలలో చింతమనేని గట్టి షాక్ తగిలే అవకాశాలే ఎక్కువ .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here