వైసీపీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కు అనేక మంది అభిమానులు ఉన్నారు . ఆయన తలపెడుతున్న ప్రజాసంకల్ప యాత్ర తో ఇంకా ఆ అభిమానం ప్రజల్లో రెట్టింపు అయ్యింది . అయితే ఒక అభిమాని మాత్రం వినూత్నంగా తన అభిమానాన్ని ఆచాటుకుంటున్నాడు . వై ఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రి కావాలని మలికిపురం మండలానికి చెందిన సుందర శివ నాలుగేళ్లుగా ప్రతీ ఏడాది నవంబర్ లో సైకిల్ పై విజయవాడ , తిరుపతిలకు సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నాడు . ఈ సందర్భంగా శివ మాట్లాడుతూ ఇప్పటివరకు 1,450 కిలోమీటర్ల సైకిల్ పై యాత్ర నిర్వహించినట్టు జగన్ కు తెలిపానని , ఆయనను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం సఖినేటిపల్లి నుంచి తిరుపతి మీదుగా ఇడుపులపాయ వరకు సైకిల్ యాత్ర నిర్వహించి మొక్కు తీర్చుకుంటానని జగన్ కు తెలిపానన్నాడు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments