ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకొక మలుపు తిరుగుతున్నాయి . ఎన్నికలకు కేవలం 10 నెలల సమయం ఉండడంతో రాజకీయ రణరంగం మొదలయ్యింది . గత సంవత్సర కాలంగా రాజకీయంగా అనూహ్య మార్పులు ఆంధ్ర ప్రదేశ్ లో కనిపించాయి . ముఖ్యంగా పవన్ కళ్యాణ్ విషయంలో ఎవరూ ఊహించని విధంగా పరిణామాలు జరిగాయి . గత నాలుగేళ్లుగా తెలుగుదేశం ప్రభుత్వానికి అండగా ఉంది ఉన్నట్టుండి ఒక సభతో టీడీపీ కి షాక్ ఇచ్చారు పవన్ . దాని తరువాత ప్రత్యేక హోదా విషయం లో అధికార పక్షాన్ని నిలదీయడం , కేంద్ర ఏపీ కి ఇచ్చిన నిధులలో నిజా నిజాలు తెలుసుకోవాడానికి జెఎఫ్ఎఫ్సి కమిటి ఏర్పాటు చేసి కేంద్రం నుండి రాష్ట్రానికి రావలసిన నిధులు గురుంచి ప్రజలకు తెలియజేయడం జరిగింది . దాని తరువాత ఎవరూ ఊహించని విధంగా జనసేన పార్టీ మొత్తం 175 నియోజకవర్గాలలో పోటీ చేస్తామని ప్రకటించడంతో రానున్న ఎన్నికలలో త్రిముఖ పోటీ అనివార్యమైంది .

మరో వైపు ప్రతిపక్ష నేత , వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై ఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా గత నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వ తీరును ఎక్కడికక్కడ ఎండగడుతూ ఉన్నారు . ప్రత్యేక హోదా విషయంలో , అలాగే ప్రజా ప్రతినిధులు ప్రజల కులాల పట్ల చులకన భావం చూపించడం , పోలవరం ప్రాజెక్టు నిర్మాణం లో గల జాప్యం వంటి వాటి పట్ల జగన్ మరియు వారి పార్టీ సభ్యులు నిలదీస్తున్నారు . ప్రత్యేక హోదా విషయంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనేక రకాలుగా మాట్లాడడం , వారి పార్టీ నాయకులు అసందర్భంగా మాట్లాడడం వంటివి వైసీపీకి అనుకూలంగా మారాయి . దాని తరువాత వైసీపీ ఎంపీలు ప్రత్యేక హోదా సాధన కోసం రాజీనామాలు చేయడం , చాలా కాలం తరువాత ఇటీవలే లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదించడం జరిగాయి .

అయితే ఇప్పుడు ఒక విషయం ఆంధ్ర రాజకీయాలలో చర్చనీయాంశం అయ్యింది . వైసీపీ మాజీ ఎంపీ వరప్రసాద్ ఇటీవల పవన్ కళ్యాణ్ రానున్న ఎన్నికలలో వైసీపీ కి సపోర్ట్ చేస్తారని , పవనే స్వయంగా తమకు ఆ విషయం తెలిపినట్టు ప్రకటించారు . గత ఎన్నికలలో టీడీపీ కి సపోర్ట్ చేసి తాను తప్పు చేశానని పవన్ భావిస్తున్నారని , ఈ సారి మాత్రం అలా చేయనని అన్నారని వరప్రసాద్ తెలిపారు . ఈ ప్రకటనతో సర్వత్రా పవన్ నెక్స్ట్ స్టెప్ ఏమిటనేది అందరూ ఆలోచనలో పడ్డారు .

అధికార పక్షంలో కలవరం :

ఈ విషయం తెలిసిన వెంటనే ఇదే కనుక నిజమైతే రానున్న ఎన్నికలలో తమ పరిస్థితి ఏమిటనేది అధికార పక్షంలో కలవరం మొదలయ్యింది . ఈ క్రమంలో ఒక తెలుగుదేశం నేత మీడియా ముందు పవన్ , జగన్ కలిసి వస్తే తమకు ఎటువంటి సమస్య ఉండదని ఆ భయాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు . ఒక వేళ ఇద్దరూ కలిస్తే కనుక టీడీపీ పరాజయం అనివార్యమనే చెప్పాలి . ప్రత్యేక హోదా , కుల రాజకీయాలు , పోలవరం ప్రాజెక్టు , ప్రజలపై దుర్భాషలాడడం వల్ల ప్రజలలో తెలుగుదేశం ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరిగిపోయింది . మరో వైపు జగన్ కు కూడా రోజు రోజుకి ఆదరణ పెరుగుతోంది అనడానికి మొన్న రాజముండ్రి రోడ్ కం రైలు వంతెన మీద జగన్ ను కలవడానికి వచ్చిన ప్రజలే నిదర్శనం . పవన్ కూడా బరిలో ఉండడంతో కచ్చితంగా ఉత్తరాంధ్ర జిల్లాలో ఓట్లు చీలే అవకాశాలు ఉన్నాయి .

కర్ణాటక తరహాలో :

ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూస్తే కచ్చితంగా త్రిముఖ పోటీ తప్పదు . ఆ విధంగా మనం చూసుకుంటే కనుక జనసేన కనీసం మొత్తం సీట్లల్లో 20 నుండి 30 శాతం సీట్లు సంపాదించుకునే అవకాశం లేకపోలేదు . అటువంటప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సరిపడా సీట్లు గెల్చుకోవడం మిగతా రెండు పార్టీలకు కష్టమే . అటువంటప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి టీడీపీ గాని , వైసీపీ గాని జనసేనతో పొత్తు పెట్టుకొని ముందుకు వెళ్ళవలసినదే . అటువంటప్పుడు పవన్ ఏ పార్టీకి మద్దతు తెలుపుతారనేది ఆసక్తికర విషయం . ఒక వేళా కర్ణాటకలో ఇటీవల జరిగిన పరిణామాల బట్టి చూస్తే పవన్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే అవకాశము లేకపోలేదు .

వైసీపీ తో కలవడం పై పవన్ ఆలోచన :

జనసేన పార్టీ స్థాపించి 4 సంవత్సరాలు అయినా ఇప్పటివరకూ పార్టీ నిర్మాణం పూర్తి స్థాయిలో జరగలేదు . అదీ కాక పోయిన ఎన్నికలలో పోటీ చేయకుండా తెలుగుదేశం కు సపోర్ట్ చేయడంతో ఆ పార్టీని ప్రజలు ఎలా ఆదరిస్తారనేది తేలయలేదు . ఈసారి ఒంటరిగా పోటీ చేస్తే పార్టీకి కొంత మేర ప్రజలలో విశ్వాసం పెరుగుతుంది . అలాగే ప్రజలలో తమ పార్టీ పట్ల ఉన్న మద్దత్తు తెలుస్తుంది . కానీ ఇప్పుడు వైసీపీ ఎంపీ వరప్రసాద్ చెప్పిన మాటలను బట్టీ చూస్తే పవన్ జగన్ తో కలుస్తారా అనే విషయం లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి . వరప్రసాద్ అన్నట్టుగా పవన్ వైసీపీ కి సపోర్ట్ చేస్తే పార్టీ ఎలా ఎదుగుతుందనేది రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు .

జనసైనికుల భావన :

జగన్ కు మద్దతు ప్రకటిస్తామని పవనే స్వయంగా తెలిపారని వైసీపీ మాజీ ఎంపీ వరప్రసాద్ అన్న వ్యాఖ్యలతో జనసేన పార్టీ కార్యకర్తలు ఒక్కసారిగా అయోమయానికి గురయ్యే పరిస్థితి . పవన్ మీడియా పరంగా మొత్తం 175 స్థానాలలో పోటీ చేస్తామని , బూతు స్థాయి నుండి అన్ని ఎన్నికలలో పార్టని బలోపేతం చేసుకుంటూ అన్ని ఎన్నికలలో జనసేన ఒంటరిగా ప్రకటించి ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం పై జనసైనికులలో ఆందోళనలు పెరిగిపోతున్నాయి . అదీ కాకా పోయిన ఎన్నికలలాగే ఈ సారి కూడా వేరొక పార్టీ కి సపోర్ట్ చేస్తే తమ పార్టీ ఎప్పటికి పూర్తి స్థాయిలో ఎప్పటికి బలోపేతం అవుతుందని అనుమానం కలిగే అవకాశం ఉంది . ఈ పరిణామం కనుక జరిగితే పవన్ కు చెడ్డ పేరు వచ్చే అవకాశాలు ఉన్నాయి .

మరి వైసీపీ నాయకులు వరప్రసాద్ చేసిన వ్యాఖ్యలలో ఎంత మేరకు నిజం ఉంది , పవన్ రానున్న ఎన్నికలలో ప్రకటించినట్టుగా ఒంటరిగానే పోటీ చేస్తారా , లేక ఇంకొక పార్టీ కి మద్దతు ఇస్తారా ఎన్నికల సమయం వరకు వేచి చూడక తప్పదు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments