విభజన చట్టంలో పేర్కొన్నట్టుగా కడప స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శనివారం కడపలో మహా ధర్నాను చేపట్టింది. జిల్లాలోని పాత కలెక్టరేట్‌ వద్ద వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మహాధర్నాను ప్రారంభించింది. దివంగత నేత వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి వైఎస్సార్‌ సీపీ నేతలు మహాధర్నాను ప్రారంభించారు. జూన్‌ 23 నుంచి 26 వరకు కడపలో ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు గురువారం వైఎస్సార్‌సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. అంతేకాక ఈ నెల 24న(జూన్‌) బద్వేలులో మహా ధర్నా, రాజాంపేటలో 25న మహాధర్నా, జమ్మలమడుగులో భారీ దీక్షలు చేపడుతామని చెప్పారు.

ఈ కార్యక్రమానికి వైస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సమన్వయకర్తలు హాజరయ్యారు. అందులో భాగంగా జూన్‌ 27న జాతీయ రహదారుల దిగ్బంధం, కడప స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం కోసం డిమాండ్‌ చేస్తూ జూన్‌ 29న రాష్ట్ర బంద్‌కు వైఎస్సార్‌సీపీ పిలుపునిచ్చింది. గత నాలుగేళ్లుగా కడప ఉక్కు- రాయలసీమ హక్కు అనే నినాదంతో ఉద్యమం జోరుగా నడుస్తున్న విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here