భారీ వర్షం కారణంగా వైసీపీ అధినేత జగన్ చేపట్టిన పాదయాత్ర రద్దైంది. ఈ విషయాన్ని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. అభిమానులు, కార్యకర్తలు ఇబ్బంది పడకూడదనే కారణంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ప్రస్తుతానికి ఉదయం సెషన్ ను మాత్రమే రద్దు చేశామని… మధ్యాహ్నానికి వర్షం తగ్గితే, పాదయాత్ర యథావిధిగా కొనసాగుతుందని చెప్పారు. వర్షం తగ్గని పక్షంలో రేపు ఉదయం పాదయాత్ర కొనసాగుతుందని తెలిపారు. ఈ రోజు జరగాల్సిన సోషల్ మీడియా వాలంటీర్ల సమావేశం కూడా రద్దయినట్టు ఆయన ప్రకటించారు. జగన్ పాదయాత్ర ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా చింతలపల్లి వద్ద కొనసాగుతోంది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments