బియ్యం గింజ కంటే చిన్న కంప్యూటర్‌ మీరెప్పుడైనా చూశారా? అయితే అమెరికాలోని మిచిగాన్‌ యూనివర్సిటీ పరిశోధకులు రూపొందించిన ప్రపంచంలో అత్యంత చిన్న కంప్యూటర్‌ను మీరు చూడాల్సిందే. ఇది బియ్యం గింజ కంటే చిన్నదిగా ఉంది . ఈ డివైజ్‌ కేవలం 0.3 ఎంఎం మాత్రమే ఉంటుంది . మామూలు డెస్క్‌టాప్‌ల మాదిరిగా కాకుండా , ఈ మైక్రోడివైజ్‌ను స్విచ్ఛాప్‌ చేయగానే దీనిలో ముందు చేస్తున్న ప్రొగ్రామింగ్‌, డేటా అంతా డిలీట్ అయిపోతుంది . అయితే దీన్ని కంప్యూటర్‌గా పిలువాలా? లేదా? అన్నది ఇంకా స్పష్టంగా తెలియదని ఎలక్ట్రికల్‌ అండ్‌ కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ ప్రొఫెసర్‌ డేవిడ్ బ్లోవ్ అన్నారు . ఇది మామూలు కంప్యూటర్లతో పోలిస్తే పదింతలు చిన్నదిగా ఉంటుందని తెలిపారు. దీంతో తక్కువ ఖాళీ ఉన్న ప్రాంతాల్లో తేలికగా బిగించవచ్చని పేర్కొన్నారు. దీన్ని మిచిగాన్‌ మైక్రో మోట్‌గా అభివర్ణించారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments