చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా ‘విజేత ‘ సినిమా రూపొందింది. రాకేశ్ శశి దర్శకత్వం వహించిన ఈ సినిమా, వచ్చేనెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని అందించారు. రేపు సాయంత్రం 6 గంటల నుంచి హైదరాబాద్ – జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఈ వేడుక ప్రారంభం కానుంది. ఈ వేడుకకి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతూ ఉండగా, ఆయనతో పాటు చరణ్ .. అల్లు అర్జున్ కూడా రానున్నట్టు చెబుతున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి వదిలిన ‘కో .. కొక్కరొకో .. ‘ అనే పాటకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ పాట .. ఈ సినిమాపై అంచనాలు పెంచేసిందనే చెప్పాలి.
రేపే “విజేత” ఆడియో
Date: