క్షమించమని వేంకటేశ్వరస్వామిని మొక్కుకున్నా

0
191

గతంలో ఓ సందర్భంలో మాట్లాడుతూ వెంకన్నస్వామి అనబోయి పొరపాటున వెంకన్న చౌదరి అన్నాని టీడీపీ ఎంపీ మురళీమోహన్ ఆవేదన వక్తం చేశారు. చేసిన పొరపాటును క్షమించాలని వెంకన్నను కోరుకున్నానని చెప్పారు. పొరపాటు జరగింది, మన్నించు స్వామీ అంటూ వేడుకున్నానని తెలిపారు. వైసీపీ ఎంపీల రాజీనామాలు ఒక నాటకమని… రాజీనామాలు చేసిన 75 రోజుల తర్వాత వాటిని ఆమోదించడం ఓ రాజకీయ డ్రామా అని విమర్శించారు. ఉప ఎన్నికలకు వైసీపీ భయపడుతోందని… అందుకే బీజేపీతో చీకటి ఒప్పందం చేసుకుందని ఆరోపించారు. ఈ ఉదయం ఆయన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం, మీడియాతో మాట్లాడుతూ…వ్యాఖ్యలు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here