నాకు ఆస్తిపాస్తులు లేవు …

1253

తన వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నారు శుభలేఖ సుధాకర్ . ఈయన సినిమాలలోనే కాక అనేక సీరియల్స్ లో కూడా మంచి పాత్రలు పోషిస్తున్నారు . తాజాగా ఒక ఇంటర్వ్యూ లో ఆయన అనేక ఆసక్తికర విషయాలు పంచుకున్నారు . ఆయన మాట్లాడుతూ తనకు ఆస్తిపాస్తులు , అందమైన శరీర ఆకృతి లేకపోవడంతో మంచి బిజీ గా ఉన్న సమయంలో కూడా హీరో గా ప్రయత్నించలేదని అన్నారు . క్యారెక్టర్ ఆర్టిస్ట్ వేషాల గురుంచి సుధాకర్ ప్రస్తావిస్తూ ఒక ఆసక్తికర విషయాన్ని ప్రస్తావించారు . తనకు పెళ్లి అవ్వక ముందు పది సినిమాలకు తాను సైన్ చేశానని , కానీ పెళ్లి అయిన తరువాత అంటే సరిగ్గా పది రోజుల వ్యవధిలో ఆ పది సినిమాలు చేజారిపోయాయని , దానికి కారణం ఏమిటనేది ఇప్పటి వరకూ అర్ధం కాలేదని ఆయన పేర్కొన్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here