జగన్ పోరు పడలేకే ఆ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేశారు …

1204

వైసీపీ అధినేత వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పోరు పడలేకే ఇష్టం లేకున్నా ఆ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేశారని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు . ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం పదవులు త్యాగం చేసిన కేంద్ర మంత్రులు సుజనా చౌదరి , అశోక్ గజపతి రాజు గొప్పా … ? ఉప ఎన్నికలు రాకుండా , ఇష్టం లేకుండా రాజీనామాలు చేసిన ఎంపీలు గొప్పా ? అని ప్రశ్నించారు . బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా , ప్రధాని మోదీతో వైసీపీ నేతలు పోరాడి ఉపఎన్నికలు తీసుకు రావాలని , తాము ఉపఎన్నికలకు సిద్ధంగా గా ఉన్నామని ఈ సందర్భంగా సోమిరెడ్డి స్పష్టం చేశారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here