దక్షిణాది సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్స్ లో సమంత ఒకరు . ఆమెకు సామాజిక స్పృహ కూడా ఎక్కువే . ఆమె తన ఫౌండేషన్ ద్వారా అనాధ పిల్లలకు మరియు పేద విద్యార్థులకు సహాయం చేస్తుంటారు . అయితే తాజా సమంత ఒక స్ఫూర్తిదాయకమైన ట్వీట్ చేశారు . ఆమె ట్వీట్ చేస్తూ తమ కుటుంబం ఈ ఏడాది వంద మంది చిన్నారులకు ఏడాది పాటు మధ్యాహ్న భోజనం అందిస్తోందని , ఏడాదికి కేవలం 950 రూపాయల విరాళంగా ఇస్తే ఏడాదిపాటు ఒక విద్ల్యార్ధికి రుచికరమైన పౌష్టికాహార భోజనం అందించవచ్చని , అందరిని అక్షయ పాత్ర ఫౌండేషన్ కు సాయం చేయమని డొనేషన్స్ కోసం అక్షయ పాత్ర ఫౌండేషన్ లింక్ కూడా పొందుపరిచారు .
This year our family is sharing our lunch with 100 schoolchidlren for an entire year!
You too can join by just contributing just 950/-. That provides hot, tasty & nutritious lunch to a schoolchild for an entire year!https://t.co/jGi8v2QEap#iShareMyLunch#AkshayaPatra
— Samantha Akkineni (@Samanthaprabhu2) June 22, 2018