ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన కుటుంబం తో కలిసి విజయవాడ కు వెళ్ళిన విషయం తెలిసినదే . అక్కడకు వెళ్ళిన సమయంలో పవన్ పెద్ద కొడుకు అకీరా నందన్ కూడా ఆయన వెంట ఉండడం జరిగింది . వారిద్దరూ కలిసి ఉన్న ఫోటో బయటకు రావడంతో పవన్ ఫాన్స్ తెగ ఖుషీ అయిపోతున్నారు . ఈ ఫోటో లో అకీరా చేతిలో కూడా ఒక పుస్తకం ఉండడంతో అకీరా కూడా తన తండ్రి పవన్ లాగా చిన్న వయసు నుండే పుస్తకాలు చదివే అలవాటు చేసుకుంటున్నారని పవన్ ఫాన్స్ మురిసిపోతున్నారు . ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్ కు తోడుగా , ఆయన రాజకీయ వారసుడిగా అకీరా ఇక్కడే ఉండిపోతారా ? అని కొంత మంది నేతిజేన్లు రేణు దేశాయ్ కు మెసేజ్ చేస్తున్నారట .

ఈ మెసేజెస్ కు ఆమె ట్విట్టర్ ద్వారా స్పందించారు . ఆమె ట్వీట్ చేస్తూ “అకీరా తన స్కూల్ హాలిడేస్ తన తండ్రితో గడిపేందుకు వెళ్ళాడు . అంతేకానీ హైదరాబాద్ కు షిఫ్ట్ అయిపోలేదు . నిన్న విజయవాడలో కళ్యాణ్ గారితో అకీరా కనిపించినప్పటినుండి నాకు మెసేజ్ లు వస్తున్నాయ్ . వాటికి క్లారిటీ ఇవ్వడానికి ఈ ట్వీట్ చేస్తున్నా” అని రేణు దేశాయ్ పేర్కొన్నారు .

 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments