క్రికెట్ ఆట అంటే దేశంలో చాలా మంది అభిమానులు రక్తం ధారబోయడానికి కూడా వెనుకాడరు. కానీ, ఫుట్‌బాల్ అంటే కూడా విపరీతంగా అభిమానించే ఓ వీరాభిమాని కేరళలో ఉన్నాడు. గురువారం అర్జెంటినా, క్రొయేషియా మధ్య జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌లో అర్జెంటినా ఓడిపోయింది. అయితే అర్జెంటినాకు చెందిన ఫుట్‌బాల్ క్రీడాకారుడు మెస్సీని విపరీతంగా అభిమానించే కేరళకు చెందిన దినూఅలెక్స్(30) శుక్రవారం తెల్లవారుజామునుంచి కనిపించకుండా పోయారు. గురువారం రాత్రి మ్యాచ్‌ను చూశాక తీవ్ర కుంగుబాటుకు గురైన దినూఅలెక్స్ ఓ సూసైడ్ నోట్‌ను ఇంటిలో వదిలి వెళ్లిపోయాడు. నేను ఇక ఈ ప్రపంచానికి అవసరం లేదు. అందుకే దూరంగా వెళ్లిపోతున్నా అని సూసైడ్ నోట్లో రాసి ఉంది.
అర్జెంటినా ఓడిపోయినందుకు..ఆత్మహత్య చేసుకుంటున్నా!
Subscribe
Login
0 Comments