టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇవాళ ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు తాగుబోతు, సన్నాసి అని టీజీ వెంకటేశ్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని కర్నె ప్రభాకర్ పేర్కొన్నారు. టీజీని తక్షణమే మెంటల్ ఆస్పత్రిలో చేర్పించాలని సూచించారు. టీజీ వెంకటేశ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలి. కేకేను విమర్శించే స్థాయి టీజీకి లేదన్నారు. టీజీ వెంకటేశ్ ఘర్షణ వాతావరణాన్ని సృష్టిస్తున్నారని కర్నె ప్రభాకర్ నిప్పులు చెరిగారు.
టీజీ వెంకటేశ్‌ను మెంటల్ ఆస్పత్రిలో చేర్పించాలి
Subscribe
Login
0 Comments