విజయ్ దేవరకొండ , రష్మిక మందన జంటగా పరశురాం దర్సకత్వంలో రూపొందుతున్న సినిమా గీత గోవిందం . ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తుండగా అల్లు అరవింద్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు . ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదలై అందరినీ ఆకట్టుకుంటోంది . ఈ ఫస్ట్ లుక్ లో హీరో విజయ్ దేవరకొండ తన కాళ్ళని గోడకి ఆన్చి ఉంటె హీరోయిన్ రష్మిక ఆ కాళ్ళపై కూర్చొని ఎంజాయ్ చేస్తోంది . ఈ ఫస్ట్ లుక్ బట్టి చూస్తే ఈ సినిమా మంచి రొమాంటిక్ కథ అని తెలుస్తోంది .

ఇప్పుడు ఈ ఫస్ట్ లుక్ యూత్ ను తెగ ఆకట్టుకుంటోంది . “నా కాళ్ళు తిమ్మిరి ఎక్కినా , నడుము నొప్పి లేచినా , మీ బరువూ బాధ్యత ఎప్పుడు నాదే మేడం” అని విజయ్ దేవరకొండ తన ఫేస్బుక్ ఖాతా ద్వారా ఫస్ట్ లుక్ షేర్ చేస్తూ రాసుకొచ్చారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments