ఏపీ రాజకీయాల్లో మరో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో స్పీకర్ గా పని చేసిన కాంగ్రెస్ నేత నాదెండ్ల మనోహర్ జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో భేటీ అయ్యారు. హైదరాబాదులో జరిగిన ఈ సమావేశంలో, వారిద్దరూ దాదాపు అరగంట సేపు చర్చలు జరిపారు. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీతో నాలుగు రోజుల క్రితమే నాదెండ్ల మనోహర్ తో పాటు, ఇతర ఏపీ కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై చర్చించారు. ఇంతలోనే పవన్ తో మనోహర్ భేటీ కావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. వివిధ అంశాలతో పాటు, ఏపీలో నెలకొన్న పరిస్థితులపై వీరిద్దరూ చర్చించినట్టు సమాచారం.
పవన్ తో భేటీ అయిన మాజీ స్పీకర్
Subscribe
Login
0 Comments