ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును చూసి గర్వపడుతున్నానని మాజీ మంత్రి దానం నాగేందర్ స్పష్టం చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ వీడడానికి గల కారణాలను వెల్లడించారు. ఏ పార్టీ చేయని విధంగా.. టీఆర్ఎస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తుందన్నారు. కేసీఆర్ పథకాలను చూసి పలువురు ఆకర్షితులవుతున్నారని తెలిపారు. రైతుబంధు, రైతుబీమాపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుందన్నారు. షాదీముబారక్, కల్యాణలక్ష్మీ పథకాలు బడుగు బలహీన కులాల్లో వెలుగులు నింపుతుందని దానం పేర్కొన్నారు.
కేసీఆర్‌ను చూసి గర్వపడుతున్నా
Subscribe
Login
0 Comments