చాలా మంది సినీ తారలు రాజకీయాల్లోకి అడుగు పెట్టాలనుకుంటున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది . ముఖ్యంగా కమెడియన్ ఆలీ విషయంలో ఆయన రానున్న ఎన్నికలలో తన మిత్రుడు పవన్ కళ్యాణ్ జనసేన ద్వారా పోటీకి దిగే అవకాశం ఉందని బాగా ప్రచారం జరుగుతోంది . అయితే రాజకీయ రంగప్రవేశం పై నటుడు ఆలీ స్పందించారు . ఆయన వద్ద పర్సనల్ అసిస్టెంట్ గా పని చేస్తున్న మునుసూరి వరప్రసాద్ వివాహ వేడుక పుల్లేటికుర్రు శివారు జొన్నాడవారిపేటలో శుక్రవారం జరిగింది . ఈ కార్యక్రమం లో ఆలీ పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు . అనంతరం ఆయన ముక్కాములలో ఆయన కలిసిన విలేఖరులతో మాట్లాడుతున్న సందర్భంగా రాజకీయ రంగం లో రావడం గురుంచి ప్రస్తావన రావడంతో తాను రాజకీయాల్లో ప్రవేశించే విషయాన్ని సమయం వచ్చినప్పుడు వెల్లడిస్తారని ఆలీ అన్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments