జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీను బలోపేతం చేసే పనులు వేగవంతం చేశారు . ఇప్పుడు తాజాగా ఆయన జనసేన పార్టీ కు సంబంధించి ట్వీట్లు చేశారు . పోరాటం చేసే వారికి తెగువతో పాటు విషయ పరిజ్ఞానం ఉండాలని , ఈ నేపధ్యంలో జనసేన కార్యకర్తలకు బూత్ స్థాయిలో శిక్షణ తరగుతులు నిర్వహించనున్నట్లు పవన్ తెలిపారు . ఇంకొక ట్వీట్ లో ప్రజల్లో ఏళ్ల తరబడి కొనసాగుతున్న భేదాభిపరాయాలు తొలగించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు . ఈ శిక్షణ తరగతులు జనసేన పార్టీ వ్యూహకర్త దేవ్ తో పారు వారి బృందం పర్యవేక్షిస్తునట్లు తెలిపారు . ఈ శిక్షణ తరగతులు ఈ నెలాఖరులో ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభిస్తామని , ఈ కార్యక్రమానికి జనసైనికులు అందరూ హాజరై పరిపూర్ణులు కావాలని ఆశిస్తునట్లు పవన్ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments