మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాల‌కృష్ణ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఒక‌ప్పుడు వారి సినిమాలు విడుద‌ల అవుతున్నాయంటే వారం రోజుల నుండే థియేట‌ర్స్ ద‌గ్గ‌ర పండుగ వాతావ‌ర‌ణం క‌నిపించేది. చిరంజీవి ప్ర‌స్తుతం త‌న 151వ సినిమా సైరా తో బిజీగా ఉండ‌గా, బాల‌య్య త‌న తండ్రి బ‌యోపిక్‌తో పాటు వినాయ‌క్ సినిమా కోసం స‌న్నాహాలు చేసుకుంటున్నాడు. అయితే వీరిద్ద‌రు గౌత‌మ‌పుత్ర శాత‌క‌ర్ణి లాంచింగ్ స‌మ‌యంలో ఒకే వేదిక‌పై కనిపించారు. ఇప్పుడు మ‌రోసారి వీరిద్ద‌రు ఒకే స్టేజ్‌ని షేర్ చేసుకోబోతున్నార‌ని తెలుస్తుంది.

చిరు చిన్న అల్లుడు క‌ళ్యాణ్ దేవ్ హీరోగా రాకేశ్ శశి తెర‌కెక్కించిన చిత్రం విజేత‌. వారాహి సంస్థ నిర్మించిన ఈ చిత్ర ఆడియో వేడుక ఈ నెల 24న జ‌ర‌గ‌నుంది. ఈ కార్య‌క్ర‌మానికి చిరంజీవి రావ‌డం క‌న్‌ఫాం కాగా, బాల‌య్య కూడా హాజ‌రు అవుతారని అంటున్నారు. వారాహి సంస్థతో ఉన్న అనుబంధంతో బాలకృష్ణ వేడుక‌కి హాజ‌ర‌య్యేందుకు సిద్ధంగా ఉన్నార‌ని టాక్‌. ఇదే క‌నుక నిజ‌మైతే విజేత సినిమాకి కావ‌ల‌సినంత ప్ర‌మోష‌న్ రావ‌డంతో పాటు ఇటు మెగా అభిమానుల‌కి , ఇటు నంద‌మూరి అభిమానుల ఆనందానికి హ‌ద్దే లేకుండా పోతుంది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments