ప్రజా సమస్యలు తెలుసుకుంటూ , వారికి భరోసా కల్పిస్తూ ప్రతిపక్ష నేత , వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గత ఆరు నెలలుగా ప్రజసంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర సాగిస్తున్నారు . ఆయన చేస్తున్న పాదయాత్ర ఇటీవలే 2,400 కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది . అయితే బన్నా బత్తుని కిషోర్ అనే యువకుడు జగన్ పై తనకున్న అభిమానాన్ని వినూత్న రీతిలో చూపించాడు . ఇప్పటివరకు జగన్ పాదయాత్ర చేసిన నియోజికవర్గ పేర్లతో జగన్ బొమ్మను గీసి తన అభిమానాన్ని చాటుకున్నాడు . ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది . ఆ యువకుడు వైఎస్ఆర్సీపీ తెనాలి సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ సోదరుడు కావడం విశేషం .

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here