ఇటీవల కృష్ణానది లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి . వాటిని మర్చిపోకముందే కృష్ణా జిల్లాలో మరో విషాదం చోటుచేసుకుంది . కృష్ణా జిల్లా ఇబ్రహింపట్నం పవిత్ర సంగమం వద్ద కంచికచర్లోని మిక్(ఎంఐసి) ఇంజనీరింగ్ కాలేజీ లో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్న నలుగు విద్యార్ధులు ఈతకు వెళ్లి గల్లంతయ్యారు . వీరిలో తొలుత ఒక విద్యార్ధి స్నానం చేయడానికి కృష్ణా నదిలో దిగగా ప్రమాదవశాత్తు లోపలి జారిపోయాడు . అది గమనించిన తోటి విద్యార్ధులు తమ స్నేహితుడిని కాపాడేందుకు యత్నించి ఆ ప్రయత్నంలో మిగిలిన ముగ్గురు విద్యార్ధులు కూడా గల్లంతయ్యారు . కాగా గల్లంతైన వారు ప్రవీణ్ (18) , చైతన్య (18) , శ్రీనాథ్(19) , రాజ్ కుమార్ (19) గా గుర్తించారు . ఘటన సమాచారం అందుకున్న వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగి గల్లంతయిన విద్యార్ధుల కోసం గాలిస్తున్నారు . ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments