మరో సారి తాత పాత్రలో మనవడు …

1215

అలానటి నటి సావిత్రి జీవిత కధ ఆధారంగా తెరకేంక్కిన సినిమా మహానటి . సావిత్రి నట జీవితం లో అక్కినేని నాగేశ్వరరావు ది ప్రముఖమైన పాత్ర . ఇద్దరు కలిసీ అనేక సినిమాలలో నటించారు . ఈ చిత్రంలో నాగేశ్వరరావు పాత్రకు నగచైతన్యను సంప్రదించగా ఈ పాత్రను చైతూ పోషించారు . పాత్ర నిడివి తక్కువే అయినా మంచి మార్కులు కొట్టేశారు . ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం మరోసారి నాగచైతన్య ఏఎన్నార్ పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయి .

అసలు విషయం ఏమిటంటే బాలకృష్ణ ప్రధాన పాత్రలో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో యుగపురుషుడు “యన్.టి.ఆర్” రూపొందుతున్న విషయం తెలిసినదే . ఎన్టీఆర్-ఏఎన్నార్ ఎన్నో చిత్రాలలో కలిసి నటించారు . వారిద్దరూ సినీ జీవితంలోనే కాక , నిజ జీవితంలో కూడా అన్నదమ్ముల్ల్లాగా మెలిగే వారు . అందువలన ఎన్టీఆర్ జీవితంలో ఏఎన్నార్ పాత్ర కనిపించి తీరుతుంది . ఈ కారణంగా దర్శకుడు క్రిష్ ఏఎన్నార్ పాత్రను పోషించమని నగచైతన్యను కోరారట . ఈ సినిమాలో ఏఎననార్ పాత్ర నిడివి ఎక్కువగా ఉంది , సన్నివేశాలకి ప్రాధాన్యత ఉంటుందని సమాచారం . మరి చైతూ ఈ చిత్రం విషయం లో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here