టైటిల్ : జంబ లకిడి పంబ
జానర్ : కామెడీ ఎంటర్‌టైనర్‌
తారాగణం : శ్రీనివాస్‌ రెడ్డి, సిద్ధి ఇద్నాని, పోసాని కృష్ణమురళీ, వెన్నెల కిశోర్‌
సంగీతం : గోపి సుందర్‌
దర్శకత్వం : జేబీ మురళీ కృష్ణ
నిర్మాత : ఎన్‌ శ్రీనివాస్‌ రెడ్డి, రవి, జోజో జోస్‌

1993లో రిలీజ్‌ అయిన సూపర్‌ హిట్ క్లాసిక్‌ జంబ లకిడి పంబ. ఇవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయం సాధించటమే కాదు కామెడీలో కొత్త ఒరవడికి తెరలేపింది. అయితే ఇన్నేళ్ల తరువాత అదే కాన్సెప్ట్‌ తో అదే టైటిల్‌ తో మరో సినిమా తెర మీదకు వచ్చింది. కమెడియన్‌గా కొనసాగుతూనే హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న  శ్రీనివాస్‌ రెడ్డి హీరోగా తెరకెక్కిన ఈ మోడ్రన్ జంబ లకిడి పంబ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది..?

నటీనటులు :
కమెడియన్‌గా మంచి ఇమేజ్‌ ఉన్న శ్రీనివాస్‌ రెడ్డి హీరోగానూ తన ఇమేజ్‌కు తగ్గ కథలను మాత్రమే ఎంచుకుంటూ వస్తున్నాడు. జంబ లకిడి పంబ సినిమాలోనూ అదే ఫార్ములాను కంటిన్యూ చేశాడు. కొన్ని సీన్స్‌ లో లవర్ భాయ్‌లా కనిపించే ప్రయత్నం చేసినా పెద్దగా వర్క్‌ అవుట్ కాలేదు. కామెడీ పరంగా మాత్రం తనదైన స్టైల్‌లో ఆకట్టుకున్నాడు. హీరోయిన్‌గా పరిచయం అయిన సిద్ధి ఇద్నాని మంచి నటన కనబరించారు. చాలా సీన్స్‌ లో శ్రీనివాస్‌ రెడ్డిని డామినేట్‌ చేశారు. ముఖ్యంగా వరుణ్ ఆత్మ తనలోకి వచ్చిన తరువాత వచ్చే సీన్స్‌ లో చాలా ఈజ్‌తో నటించి ఆకట్టుకున్నారు. సినిమాలో మరో కీలక పాత్రలో పోసాని కృష్ణమురళి. తనకు అలవాటైన పాత్రలో పోసాని మరోసారి మంచి నటన కనబరిచారు.

ప్లస్‌ పాయింట్స్‌ :
టైటిల్‌
కొన్ని కామెడీ సీన్స్‌

మైనస్‌ పాయింట్స్‌ :
బలమైన కథ లేకపోవటం
ఆశించిన స్థాయిలో కామెడీ పండకపోవటం
నెమ్మదిగా సాగే కథనం

Rating : 2.5/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here