షకలక శంకర్ కి హాస్యనటుడిగా మంచి పేరుంది. ఆయన స్టేజ్ పై వుంటే చిరంజీవిని గురించిన ప్రస్తావన తీసుకురావడమో .. పవన్ కల్యాణ్ ను అనుకరించడమో చేస్తుంటాడు. అలాంటి శంకర్ తాజాగా ‘yoyo సినీ టాకీస్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను గురించి ప్రస్తావించాడు.

“నాకు ఊహతెలిసిన తరువాత నేను విన్న హీరో పేరు చిరంజీవి. నేను స్కూల్లో చదువుకునేవాడిని కాదు .. చిరంజీవిగారి బొమ్మలు వేస్తూ కూర్చునేవాడిని. ‘చదువుకోమంటే బొమ్మలేస్తావేంట్రా’ అంటూ మాస్టారు నన్ను బాగా కొట్టేవాడు. అయినా పట్టించుకోకుండా మాస్టారు పాఠం చెప్పేలోగా చిరంజీవిగారి బొమ్మ గీసేసే వాడిని. ఇక నన్ను కొట్టడం వలన ప్రయోజనం లేదనుకుని .. ఇక వీడు మారడనుకుని, నేను వేసిన చిరంజీవి బొమ్మలకే రైట్లు కొట్టేసి .. మార్కులు వేసేసి మాస్టారు వెళ్లిపోయేవారు. చిరంజీవి గారంటే నాకు అంత ఇష్టం .. ఇక పవన్ కల్యాణ్ అంటే ప్రాణం” అంటూ చెప్పుకొచ్చాడు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments