ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించావలసినదిగా వైసీపీ ఎంపీలు వరప్రసాద్ రావు , వైవీ సుబ్బారెడ్డి , మేకపాటి రాజమోహనరెడ్డి , మిథున్ రెడ్డి , అవినాష్ రెడ్డి లు ఈ సంవత్సరం ఏప్రిల్ 6 వ తేదీన లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కు తమ రాజేనామా లేఖలను సమర్పించిన విషయం తెలిసినదే . అయితే ఈ రాజీనామాల ఆమోదం విషయంలో జాప్యం జరుగుతూ వచ్చింది . అయితే కొన్ని రోజుల క్రితం రాజీనామాలపై వైసీపీ ఎంపీలు పునరాలోచించుకోవాలని , నిర్ణయం మారకపోతే రాజీనామాలు ఆమోదిస్తామని సుమిత్ర మహాజన్ అన్నారు . ఈ నెల 7 వ తారేఖున ఈ విషయం పై మళ్ళీ తన వద్దకు రావాలని సుమిత్ర మహాజన్ వైసీపీ ఎంపీలకు కోరినా ఆమె విదేశీ పర్యటనకు వెళ్ళడంతో రాజీనామాల ఆమోద ప్రక్రియ మరింత ఆలస్యం అయ్యింది . చివరికి ఈరోజు లోక్ సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ ఎట్టకేలకు వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదించారు .

అయితే ఇప్పుడు ఆ ఐదుగురు మాజీ ఎంపీల భవిష్యత్ కార్యాచరణ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది . అయితే ఈ రాజీనామాల ఆమోదం విషయం పై మాజీ ఎంపీలు వైసీపీ అధ్యక్షుడు వై ఎస్ జగన్ తో చర్చించి తమ భవిష్యత్ కార్యాచరణ తెలిపే అవకాశాలు ఉన్నాయి .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments