స్టార్ వారసురాలిగా సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్‌, నటిగా ఆకట్టుకున్నా సక్సెస్‌ పరంగా మాత్రం ఆకట్టుకోలేకపోయారు. తొలి సక్సెస్‌ కోసం చాలాకాలం ఎదురుచూసి ఈ బ్యూటీ గబ్బర్‌ సింగ్‌ సినిమాతో విజయాన్ని అందుకున్నా..  ఆ సక్సెస్‌ ట్రాక్‌ను కంటిన్యూ చేయలేకపోయారు. కొంతకాలంగా నటనకు దూరంగా ఉంటున్న ఈ బ్యూటీ త్వరలో కొత్త అవతారంలో దర్శనమివ్వనున్నారు.తండ్రి కమల్‌ హాసన్‌ సినిమాలకు నిర్మాణ బాధ్యతలు చూసుకున్న అనుభవం ఉన్న ఈ భామ త్వరలో పూర్తి స్థాయి నిర్మాతగా మారనున్నారు. ఇప్పటికే ఇసిడ్రో మీడియా అనే బ్యానర్‌ను నెలకొల్పిన శృతి త్వరలో ఈ బ్యానర్‌పై తొలి ప్రాజెక్ట్‌ను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. జయప్రకాష్ రాధాకృష్ణన్‌ దర్శకత్వంలో ది మస్కిటో ఫిలాసఫీ అనే సినిమాను శృతి నిర్మించనున్నారు. అయితే ఇది పూర్తి స్థాయి సినిమానా లేక వెబ్‌ వర్షనా అన్న విషయం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాపై త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here