తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ లో మొదటి ఎలిమినేషన్ లో బయటకు వచ్చేసింది సంజనా. విజయవాడకు చెందిన ఈ మోడల్ ప్రస్తుతం అందరికీ ఇంటర్వ్యూలు ఇస్తోంది. సెలెబ్రిటీలు అని చెప్పుకుంటున్న వారిలో బాబు గోగినేని, దీప్తి సునయన, కిరీటి దామరాజు ఎవరో కూడా తనకు తెలియదని చెప్పుకొచ్చింది.
ఇక తాజాగా బాబు గోగినేనిపై విరుచుకుపడింది. బాబు గోగినేని అనే అతను డబ్బు మనిషి. డబ్బు కోసమే ఆయన అక్కడ డాన్సులు చేశారు. ఆయనొక సందర్భంలో విప్లవం చేయాలి అన్నారు. మరి విప్లవాలు చేసే వ్యక్తి డాన్స్ చేయడం దేనికి? టాస్క్‌లో భాగంగా డాన్స్ చేసినట్లయితే మరి మసాజ్ చేయమన్నప్పుడు ఎందుకు చేయలేదు. అది కూడా టాస్క్‌లో భాగమే కదా! నాకు బుద్ధి రావాలి అని చెప్పడానికి ఆయనెవరు? ముందు ఆయనను బుద్ధి తెచ్చుకోమనండి. తర్వాత పక్క వాళ్లకు చెప్పొచ్చు. అయినా ఆయనేమైనా మహేష్ బాబా? మసాజ్ చేయించుకొని మురిసిపోవడానికి. ఆయన వయసెక్కడ? నా వయసెక్కడ?’’ అని పేర్కొంది.