యాంకర్ రష్మీ అంటే తెలియనివారంటూ ఉండరు. బుల్లితెరపై రష్మీ చేసే సందడి అంతా ఇంతా కాదు. ప్రతీ రోజూ ప్రతీ ఇంట రష్మీ గోల పెట్టిస్తూనే ఉంటుంది. ఇదిలా ఉంటే రష్మీ, సుడిగాలి సుధీర్ పెళ్లి గాసిప్స్ అయితే సోషల్ మీడియాలో కామన్ అయిపోయాయి. ఇటీవల ఓ షోలో వీరిద్దరూ సరదాగా పెళ్లి చేసుకున్నట్లు నటించడంతో ఈ గాసిప్స్‌కి మరింత బలం చేకూరింది. దీంతో రష్మీ, సుధీర్‌పై పలు ఊహాగానాలు వెలుగులోకి వచ్చాయి. కాగా ఇదే విషయంపై తాజాగా ఓ నెటిజన్ చేసిన కామెంట్‌ పై రష్మీ స్పందించిన తీరు సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

‘‘రష్మీ, సుధీర్ మీరిద్దరూ ఒకరికోసం ఒకరు పుట్టినట్లుగా ఉంటారు. మీ కెరీర్ కోసం చాలా కష్ట పడుతున్నారు కూడా’’ అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. ఇది చూసిన రష్మీ కాస్త ఘాటుగానే స్పందించింది. ‘‘మేము ఒకరికోసం ఒకరం పుట్టామని మీరెలా డిసైడ్ చేస్తారు. మేము తెరపై నటించడం మాత్రమే మీరు చూస్తారు. రీల్ లైఫ్‌కి, రియల్ లైఫ్‌కి తేడా ఉంటుంది. తెరపై చేసేది ప్రేక్షకులకు వినోదం పంచడానికి మాత్రమే! ఎవరిని పెళ్లి చేసుకోవాలనేది మా వ్యక్తిగత అభిప్రాయం. మీ సూచనలు మాకవసరం లేదు’’ అని పేర్కొంది. రష్మీ ఇచ్చిన ఈ ఘాటు రీప్లై ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments