నిన్న నిజామాబాద్ లో ప్రేమ జంట ప్రాణదీప్ – సౌజన్య కొన్ని నిమిషాలలో ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకుంటారానగా సౌజన్య తరపు బందులు వచ్చి ఆమెను బలవంతంగా ఎత్తుకేల్లిన విషయం తెలిసినదే . దాని తరువాత ప్రియుడు తాము నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నామని , సౌజన్య తో తన పెళ్లి జరిపించావలసినడిగా పోలీసులను కోరాడు . వెంటనే పోలీసులు ఆమెను మక్లూరు తీసుకువెళ్లారని తెలుసుకొని అక్కడకి చేరుకొని సౌజన్యను కలిసారు . ఆమె చెప్పిన వివరాల ఆధారంగా సెక్షన్ 365 కింద కుటుంబ సభ్యులపై కిడ్నాప్ చేసి నమోదు చేసి , రిమాండ్ కు తరలించారు . అనంతరం ఏసీపీ సుదర్శన్ అధ్వర్యంలో సౌజన్యకు కౌన్సిలింగ్ నిర్వహించగా ఆమె ప్రియుడు ప్రాణదీప్ నే పెళ్లి చేసుకుంటామని చెప్పడంతో వారిద్దరిని టూ టౌన్ పోలేసు స్టేషన్ కు తీసుకువెళ్ళి వారిద్దరికీ పెళ్లి జరిపించారు . 24 గంటల పాటు జరిగిన నాటకీయ పరిణామాల అనంతరం ప్రాణదీప్-సౌజన్య తమ ప్రేమను గెలిపించుకున్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments