ప్రభాస్ అభిమానులందరి దృష్టి ఇప్పుడు ‘సాహో’ సినిమాపైనే వుంది. అందువల్లనే వాళ్లను నిరుత్సాహ పరచకూడదనే ఉద్దేశంతో ఆయన ఇటీవల జరిగిన యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరణలో డూప్ లేకుండగా చేశాడు. తాజాగా బాలీవుడ్ వెబ్ పోర్టల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన కొన్ని సమాధానాలు అడిగినవాళ్లను .. వినేవాళ్లను కూడా అయోమయానికి గురిచేశాయి.

‘సాహో’ తరువాత ఏం చేయబోతున్నారనే ప్రశ్న ప్రభాస్ కి ఎదురైంది. అందుకాయన స్పందిస్తూ .. “ఈ సినిమా పూర్తయిన తరువాత ఏదైనా వ్యాపారమో .. వ్యవసాయమో  చేసుకుంటానేమో” అంటూ ఆయన సమాధానమిచ్చాడు. ఈ సినిమా షూటింగు పరంగా జరుగుతోన్న జాప్యానికి అసహనానికి లోనైన ప్రభాస్, సినిమాలు చేసుకోవడం కన్నా వ్యాపారమో .. వ్యవసాయమో చేసుకోవడం బెటర్ అనే అర్థం వచ్చేలా చమత్కరించాడని చెప్పుకుంటున్నారు. వ్యవసాయం చేసుకుంటానని ప్రభాస్ సరదాగా అన్నప్పటికీ, తెరపై ఆయనను రైతుగా చూడాలని అభిమానులు ఆశపడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here