టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షుతులు తిరుమలలో స్వామివారి ఆభరణాలు అదృశ్యం పై , ముఖ్యంగా పింక్ డైమండ్ అదృశ్యం పై తీవ్ర ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసినదే . ఇప్పుడు ఈ విషయం పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు . ఆయన ట్వీట్ చేస్తూ కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్ విమానాశ్రయంలో సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ తో మాట్లాతునప్పుడు ఆ ఆఫీసర్ తిరుమల లోని ఆభరణాల అదృశ్యం గురుంచి తనకు వివరించారని అన్నారు . ఆయన చెప్పిన ప్రకారం శ్రీవారి ఆభరణాలు అన్నీ ఒక ప్రైవేటు జెట్ లో మన దేశం నుండి విదేశాలకు తరలిస్తున్నారని అని పవన్ పేర్కొన్నారు . అందుకనే తనకు టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు చేస్తున్న ఆరోపణలు కొత్తగా అనిపించడం లేదన్నారు . దొంగలు వెంకటేశ్వర స్వామి సైలెంట్ గా ఉన్నారని , ఆయనను దోచేయవచ్చు అనే ఊహలో ఉన్నారు పవన్ పేర్కొన్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments