జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాదు నుండి ప్రత్యేక విమానంలో బయలుదేరి గన్నవరం చేరుకున్నారు . అమరావతి ప్రాంతం ఆయన రెండు రోజుల పాటు పర్యటించనున్నారు . ఈ పర్యటనలో అమరావతి లోని రైతుల సమావేశంలో ఆయన పాల్గొనే అవకాశం ఉంది . రెండు రోజుల పర్యటన తరువాత పవన్ హైదరాబాదు చేరుకుంటారు . ఈ నెల 26 నుండి పవన్ తన పోరాట యాత్రను విశాఖపట్నం జిల్లాలో తిరిగి ప్రారంభిస్తారు . మూడు నుంచి నాలుగు రోజుల పాటు విశాఖపట్నం జిల్లాలో పవన్ పర్యటన కొనసాగుతోంది . ఈ పర్యటనలో ఆయన ఉత్తరాంధ్ర మేధావులతో సమావేశమయ్యి అక్కడ ఉన్న సమస్యలు , వాటి పరిష్కార మార్గాలపై చర్చించే అవకాశం ఉంది . తూర్పు గోదావరి జిల్లలో కూడా పవన్ పర్యటించనున్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments