ప్రేమతో, అభిమానంతో ఓటు వేసి గెలిపిస్తే… భయపెట్టాలని చూడటం సరికాదని ఏపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ మండిపడ్డారు. నాయీ బ్రహ్మణుల డిమాండ్లు సరైనవేనని… వారికి జనసేన అండగా ఉంటుందని తెలిపారు. భూములను రక్షించాల్సిన ప్రభుత్వమే… భూకబ్జాలకు అండగా ఉంటోందని ఆరోపించారు. రాజధాని కోసం ఇప్పటికే సరిపడా భూములను సేకరించారని… మరోసారి భూసేకరణకు దిగితే, భూసేకరణ చట్టాన్ని ప్రయోగిస్తే తాము పోరాడాల్సి వస్తుందని హెచ్చరించారు. అమరావతి ప్రాంత రైతులతో తాను సమావేశం కానున్నానని చెప్పారు. ఈ నెల 23న పవన్ విజయవాడకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

 

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments