జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన వెంట ఉండే ముస్లిం సోదరుల కోసం రంజాన్ పండుగ సందర్భంగా విశాఖ జిల్లాలో తన పోరాట యాత్రకు బ్రేక్ ఇచ్చిన విషయం తెలిసినదే . అయితే ఆయనను మూడు నెలలుగా కంటి సమస్య బాధిస్తోంది , ఈ విరామ సమయంలో కంటికి శస్త్ర చికిత్స చేయించుకొని తిరిగి యాత్రను ప్రారంభిద్దామనుకున్నారు . మొదట ఈ నెల 24 న పవన్ కు శస్త్ర చికిత్స చేయాలని డాక్టర్స్ నిర్ణయించారు . కానీ తాజాగా జరిపిన వైద్య పరీక్షలను పరిశీలించి శస్త్ర చికిత్సకు ఇంకొంత కాలం ఆగాలని డాక్టర్లు సూచించారు . ఈ పరిణామంతో తాను తిరిగి పోరాట యాత్రను ప్రారంభించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు . ఈ నెల 26 న ప్రారంభమయ్యే పోరాట యాత్ర విశాఖ జిల్లాలో మూడు నుండి నాలుగు రోజులపాటు కొనసాగుతోంది .

జి ల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల్లో పర్యటించడంతో పాటు ఉత్తరాంధ్ర మేధావులతో పవన్ కల్యాణ్ సమావేశం అయ్యే అవకాశం వుంది. విశాఖ జిల్లా అనంతరం పోరాట యాత్ర తూర్పు గోదావరి జిల్లాలో ప్రారంభం అవుతుంది. తూర్పు గోదావరి జిల్లాలో పోరాట యాత్ర సన్నాహాలలో ఆ జిల్లా జనసేన నేతలు నిమగ్నమై ఉన్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments