ఏపీ మంత్రి నారా లోకేష్ చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా శాంతిపురం మండలం తుమ్మిశి లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పై విమర్శలు గుప్పించారు . ఆయన మాట్లాడుతూ నాలుగేళ్ళు ఎపీకి కేంద్ర ప్రభుత్వం ద్రోహం చేసిందని కానీ ప్రధాని నరేంద్ర మోదీ గురుంచి జగన్ , పవన్ ఒక్క మాట కూడా మాట్లాదడంలేదని అన్నారు .

మోదీ పై విమర్శలు చేస్తే తాను జైలుకు వెళ్ళవలసి వస్తుందనే భయం జగన్ ను వెంటాడుతోందని లోకేష్ విమర్శించారు . జగన్ మోహన్ రెడ్డి పేరు ఇప్పుడు జగన్ మోదీ రెడ్డి గా మారిందని ఆయన ఎగ్దేవా చేశారు . ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా కూడా వచ్చే ఎన్నికలలో 25 కి 25 లోక్ సభ స్థానాలు తామే కైవసం చేసుకుంటామని లోకేష్ ధీమా వ్యక్తం చేశారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments