అలానాటి క్లాసిక్ సినిమాలలో నర్తనశాల సినిమా అగ్రస్థానంలో ఉంటుంది . ఇప్పుడు అదే టైటిల్ తో నాగాశౌర్య హీరో గా ఒక సినిమా రూపొందుతోంది . అయితే ఈ చిత్రానికి ఆ చిత్రానికి పేరు తప్ప ఎటువంటి సంబంధం లేదని నగశౌర్య ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు . తమ సొంత బ్యానర్ లో ఛలో చిత్రం రూపొందించి విజయం అందుకున్న నగశౌర్య ఈ సినిమా కూడా సొంత బ్యానర్ లోనే రూపొందిస్తున్నారు . ఈ సినిమాలో మేహరీన్ కధానాయికగా నటిస్తుండగా శ్రీనివాస చక్రవర్తి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు .

ఇప్పటికే ఈ చిత్రం కొంతభాగం చిత్రీకరణ జరుపుకుని చిత్రబృందం ఇటలీ వెళ్ళింది . అక్కడ కొన్ని ప్రధానమైన సన్నివేశాలు చిత్రీకరించి అక్కడి నుంచి తిరిగి వచ్చి కొంత భాగం హైదరాబాదులో చిత్రీకరణ తో సినిమా షూటింగ్ పూర్తి అవుతుంది . షూటింగ్ తో పాటు ఏకకాలంలో మిగతా పనులను ఎప్పటికప్పుడు పూర్తి చేసి ఈ చిత్రాన్ని ఆగష్టు లో విడుదల చేసే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నారు . తన సొంత బ్యానర్ లో సినిమా రూపొందిస్తున్న ఈ సినిమా నగశౌర్య కు మరో ఛలో లాంటి భారీ విజయాన్ని తెచ్చిపెడుతుందేమో చూడాలి .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments