తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కు చాలా మంది అభిమానులు ఉన్నారు . ఆయన మాట్లాడే తీరు , వ్యవహరించే తీరు బట్టి ఈ అభిమానం రోజురోజుకూ పెరుగుతోంది . ఇప్పుడు తాజా ఒక వ్యక్తి తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు . తాను పెంచుకున్న అభిమానాన్ని కేటీఆర్ కు తెలియజేసి ఫిదా చేశాడు . అతను ఒక కారును కొనుగోలు చేసి దాని నెంబర్ ప్లేట్ లో కేటీఆర్ అని వచ్చేలా చూసుకొని పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ కేటగిరీ లో దాన్ని రిజిస్టర్ చేయించాడు . “టీఎస్ 11 కే టీఆర్ 5343” నెంబర్ కారుకు లభించింది . ఈ విషయాన్ని అతడు ట్విట్టర్ లో పోస్ట్ చేసి కేటీఆర్ ను ట్యాగ్ చేశాడు . “కేటీఆర్ గారు … మీరు ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నారు ” అని కాప్షన్ పెట్టాడు . ఈ విషయాన్ని కేటీఆర్ గమనించి తన అభిమానానికి ఫిదా ఆయన కేటీఆర్ , నమస్కారం చేశారు . ఆ ఫోటో ఇప్పుడు ఇంటర్నట్ట్ లో హల్చల్ చేస్తోంది .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments