చిరంజీవి ఇంటికి వెళ్లి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ మంత్రి …

661

కాంగ్రెస్ పార్టీ నుండి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలో మెగాస్టార్ చిరంజీవి ఎంపీ ల్యాడ్స్ ద్వారా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు దాదాపు రూ . 5 కోట్ల నిధులు అందించారు . ఆ డబ్బు తో చేపట్టిన పనులు సమర్ధవంతంగా జరుగుతున్నాయని కోల్లు రవీంద్ర తెలిపారు . ఈ నేపధ్యంలో ఆయన స్వయంగా చిరంజీవి ఇంటికి వెళ్లి కృతజ్ఞతలు తెలిపారు . ఏడాదిలోగా మిగిలిన పనులన్నింటినీ పూర్తి చేస్తామని , ఆ నియోజికవర్గ ప్రజలు చిరంజీవికి రుణపడి ఉంటారని కోల్లు రవీంద్ర అన్నారు . మచిలీపట్నంలో అభివృద్ధి పనులు జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా చిరంజీవి అన్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here