కేంద్ర ప్రభుత్వం కడపలో స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం జరపలేమని తేల్చడంతో దానికి నిరసనగా కడపలో టీడీపీ ఎంపీ సి.యం.రమేష్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని ప్రకటించేదాకా తాను దీక్ష చేస్తానని నిన్నటి నుండి ఆమరణ నిరాహార దీక్ష తలపెట్టిన విషయం తెలిసినదే . ఇప్పుడు ఈ విషయం పై ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు . శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కడప స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో ఎవరూ ఆత్మత్యాగాలు చేయవలసిన అవసరం లేదని , సి.యం.రమేష్ ఎందుకు దీక్ష చేస్తున్నారో అర్ధం కావడంలేదని వ్యాఖ్యానించారు . తమకు సహకరిస్తే కచ్చితంగా స్టీల్ ఫ్యాక్టరీ సాధిస్తామని అన్నారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments