రామ్ , అనుపమ పరమేశ్వరన్ జంటగా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా “హలో గురు ప్రేమ కోసమే” ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు . ప్రస్తుతం కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది . సెప్టెంబరులో ఈ చిత్రాన్ని విడుదల చేయాలన్న యోచనలో దర్శక నిర్మాతలు ఉన్నారు . ఈ సినిమాలో నటి ఆమని కీలక పాత్రలో కనిపించనున్నారు . ఆమె పాత్ర ఈ చిత్రానికే హైలైట్ గా నిలుస్తుందని ఫిలిం నగర్ వర్గాలలో చెప్పుకుంటున్నారు . యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు . గతంలో రామ్ , అనుపమ కాంబినేషన్లో “ఉన్నది ఒకటే జిందగీ” చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి ఆదరణ పొందలేకపోయింది . కానీ ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకుల మనసు గెలుచుకుంటుందని హీరో రామ్ ధీమా వ్యక్తం చేశారు .

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments