తమపై టీడీపీ నేతలు నిరాధారంగా ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ… కేవలం రాజకీయ కారణాల వల్లే టీడీపీ నేతలు ఇలాంటి ఆరోపణలకు పాల్పడుతున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వాధికారులకి మే 30, 2018న ఓ లేఖ అందిందని, ప్రత్యేక ప్యాకేజీ కింద ఏపీకి కేంద్ర సర్కారు నుంచి ఏయే ప్రయోజనాలు వచ్చాయో రాష్ట్ర  ప్రభుత్వ అధికారులే అందులో పేర్కొన్నారని చెబుతూ, ఆ లేఖను మీడియాకు చూపించారు.

ఇదిలావుండగా, మరోవైపు ప్రత్యేక ప్యాకేజీ కింద కూడా ఎటువంటి ప్రయోజనాలు రాలేదని టీడీపీ నేతలు అంటున్నారని జీవీఎల్ విమర్శించారు. ప్రత్యేక ప్యాకేజీ కింద కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చిందని, అయినప్పటికీ టీడీపీ నేతలు ఇలా మాట్లాడడం అభ్యంతరకరమని అన్నారు. ఏపీ డిజాస్టర్‌ రికవరీ ప్రాజెక్ట్‌ను ప్రపంచ బ్యాంక్‌ నిధులతో రాష్ట్ర సర్కారు దక్కించుకుందని, అంటే ఈ ప్రాజెక్టు కోసం తీసుకున్న 2,220 కోట్ల రూపాయల రుణాన్ని కేంద్ర సర్కారే చెల్లించాలని అన్నారు.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments