ఈ మధ్య స్మార్ట్ ఫోన్ పేలుళ్ళ సంఘటనలు ఎక్కువ అవుతున్నాయ్ . ఇటీవల ఇలాంటి సంఘటనే చోటు చేసుకొని ఒకతను మృత్యు వాత పడ్డాడు . మలేషియాలో క్రాడిల్ ఫండ్ కంపెనీకి సీఈఓ నజ్రీన్ హాసన్ (45) వద్ద బ్లాక్ బెర్రీ , హువాయ్ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి . అయితే ఇంటివద్ద తన గదిలో ఛార్జింగ్‌ పెట్టిన ఫోన్లలో ఒకటి అకస్మాత్తుగా పేలిపోవడంతో నజ్రీన్‌ మృతిచెందాడని ఆయన బంధువు తాజాగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

ఫోన్‌ పేలడంతో దాని భాగాలు మెడ వెనుక భాగం, తలలోనూ గట్టిగా గుచ్చుకోవడంతో తీవ్ర రక్తస్రావమై సీఈఓ మృతిచెందారు. అయితే ఏ ఫోన్‌ పేలిందో కచ్చితమైన సమాచారం తమవద్ద లేదని పోలీసులు తెలిపారు. ఫోన్‌ పేలిన తర్వాత రూములో అలుముకున్న దట్టమైన పొగవల్ల ఊపిరాడక కొంత సమయానికే నజ్రీన్‌ హసన్‌ చనిపోయారని చెప్పారు. అందరు భావిస్తున్నట్లు అగ్నిప్రమాదం వల్ల ఆయన మరణించలేదని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది.

Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments